అలనాటి స్టార్‌ కపుల్‌ అయిన మంజుల - విజయ్‌ కుమార్‌ల పెద్ద కూతురే నటి వనితా విజయ్‌ కుమార్‌ . కోలీవుడ్‌లో సత్తా చాటుతూ టాలీవుడ్‌లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న వనితా విజయ్‌ కుమార్‌ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట.

చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకోగా అవన్నీ పెటాకులే అయ్యాయట.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కష్టాలను ఏకరువు పెట్టిందట..

 

'మా అమ్మ ఎంతో కష్టపడి స్టార్‌ హోదా సంపాదించుకుందని . మాకోసం రాత్రింబవళ్లు షూటింగ్‌ల వెంట పరుగులు పెడ్తూ డబ్బులు కూడబెట్టిందని అమ్మకు మేము ముగ్గురం కూతుళ్లం. ఏదైనా మాకు సమానంగా రావాల్సిందే. కానీ నాన్న నాకు ఏదీ ఇవ్వకూడదనుకున్నారట. మా అమ్మ చనిపోయాక నాకు ఆస్తిపాస్తుల్లో చిల్లిగవ్వ కూడా దక్కకూడదనుకున్నారట.. నామీదే కేసులు కూడా పెట్టారు. ఈ విషయంలో నేను సుప్రీంకోర్టు దాకా వెళ్లానని చెప్పింది.

 

తమిళనాడులో నాకు అడ్రస్‌ లేకుండా చేస్తానని నాన్న నాతో ఛాలెంజ్‌ కూడా చేశాడు. కానీ ఇప్పుడు తమిళ ప్రజలకు నేను బాగా దగ్గరయ్యాను. అందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. మా ఫ్యామిలీలో ఎవరిని కదిలించినా వాళ్లంతా కూడా నేను ఆ కుటుంబంలో లేనని చెప్తుంటారని. వాళ్లకు నామీద ఎందుకంత కోపమో నాకిప్పటికీ కూడా తెలియదు. ఒకసారైతే నాన్న పోలీసులను పిలిపించి మా అమ్మ ఇంట్లోంచి నన్ను బయటకు గెంటేశారని నాకు సంబంధించిన వస్తువులు, డబ్బులు కూడా ఆ ఇంట్లోనే ఉండిపోయాయని కట్టుబట్టలతో పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను అని చెప్పింది.. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను ఇక పెళ్లి సంగతి అంటారా? చిన్న వయసులో వివాహం చేయడం వల్లే నా పెళ్లిళ్లు ఎంతోకాలం నిలవలేవు' అని చెప్తూ ఎమోషనల్‌ అయిందట వనిత.ప్రస్తుతం వనిత విజయ్ కుమార్ ఇప్పుడు కొద్దిగా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: