అందాల ముద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  ఈ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న నిత్య మీనన్ ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది, నిత్య మీనన్ గ్లామర్ షో కు దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంచుకుని సినిమాలలో నటిస్తూ ఉంటుంది.  

సినిమాలతో మాత్రమే కాకుండా నిత్యా మీనన్ వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిత్యా మీనన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా  నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన గాని లేదా ఏప్రిల్ ఒకటో తేదీన గాని విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే నిత్య మీనన్ షేర్‌ చేసుకున్న లేటెస్ట్‌ ఫొటోల్లోనూ ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది.  పనిలో పనిగా అధిక బరువును తగ్గించేందుకు తాను పాటించిన ఆరోగ్య చిట్కాలను కూడా అభిమానులతో నిత్యా మీనన్ పంచుకుంది, బరువు తగ్గేందుకు కొవ్వు కరిగించే ఆపరేషన్‌ చేయించుకోవాలని చాలామంది సూచనలు ఇచ్చారు అలా చేయడం నాకు ఏ మాత్రం  ఇష్టం లేదు.  డైట్ నిపుణుల సూచనలతో ఆహారంలో మార్పులు చేసుకున్నాను, క్రమం తప్పకుండా వ్యాయామాలు, వాకింగ్ చేశాను. ఇలా దాదాపు  ఐదు నెలల నుంచి డైట్‌ కంట్రోల్‌ పాటిస్తున్నాను, నా శ్రమకు ఫలితంగా ఆరు కిలోల వరకు బరువు తగ్గినట్లు నిత్యా మీనన్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: