పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా ఇద్దరు కలిసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్ ఇక ఈ  సినిమా లో నిత్యమీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వంలో  ఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలై  హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.కాగా సూర్య దేవర నాగవంశీ తన 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మాటలు, స్క్రీన్ ప్లే ని అందించడం జరిగింది.  ఇకపోతే ఈ సినిమాలో రానా ఒక ఎక్స్ మిలిటరీ మెన్ డానియల్ శేఖర్ గా, పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనపరిచారు.

అంతేకాకుండా  అహానికి మరియు ఆత్మగౌరవానికి నడుమ మడమ తిప్పని యుద్ధం కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.  ఇక అసలు విషయానికొస్తే   ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి 'సితార ఎంటర్టైన్మెంట్స్' వారు రెడీ అయినప్పుడు చాలా మంది స్టార్లను సంప్రదించారు. అయితే ఈ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ని తీసుకో వాలని మొదట్లో ఎవరికి ఆలోచన లేదట.ఇకపోతే మొదట పవన్ ప్లేస్ లో వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ లను సంప్రదించారట మేకర్స్.అయితే ఓ దశలో రవితేజ ఫైనల్ అయినట్టే అయ్యి తప్పుకున్నాడు. ఇకపోతే  త్రివిక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ తో పవన్ ను రంగంలోకి దిగాడు.

ఇక ఆ  తర్వాత త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్టులో రెండో విధంగా కూడా భాగం కావాల్సి వచ్చింది.  చివరిలో  పవన్ సరసన ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు. ఇక దానికి సాయి పల్లవి నో చెప్పడం జరిగిందట.తరువాత నిత్యా మేనన్ ను ఎంపికచేసుకున్నారు. అయితే మరోపక్క రానా సరసన ఐశ్వర్య రాజేష్ ను అనుకున్నారు. కాగా ఆమె కూడా కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టులో భాగం కాలేకపోయింది దాంతో సంయుక్తా మేనన్ ను ఫైనల్ చేశారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: