బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చివరిగా 2018వ సంవత్సరంలో జీరో సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత ఏ సినిమాని తెరకెక్కించ లేదు. షారుక్ ఖాన్ ఆ సినిమాని తనే స్వయంగా నిర్మించాడు. ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా, కూడా షారుక్ ఖాన్ ఈ సినిమాకి తీవ్రంగా నష్టపోయాడు అని చెప్పవచ్చు. అయితే ఆ నష్టం నుంచి బయట పడటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు షారుక్ ఖాన్. అయితే తాజాగా ఎట్టకేలకు తన సినిమాకు సంబంధించి ఒక విషయం తెగ వైరల్ గా మారుతోంది.

షారుక్ ఖాన్  పఠాన్ సినిమా గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కరొనా వల్ల  ఈ సినిమా షూటింగ్ కూడా కాస్త ఆలస్యం అవ్వడం తో ఈ సినిమాను 2023 జనవరిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది చిత్రబృందం. అంటే దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ తన సినిమాని విడుదల చేయబోతున్నట్లు గా చెప్పుకోవచ్చు.పఠాన్ సినిమా నుండి తాజాగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. షారుక్ ఖాన్ గత నాలుగు సంవత్సరాలుగా నార్మల్ లుక్ లో ఉన్నప్పటికీ ఈ సినిమాలో మాత్రం చాలా స్టైలిష్ లుక్ లో ఉన్నాడని చెప్పవచ్చు.

షారుక్ ఖాన్ నటిస్తున్న పఠాన్ సినిమాకి డైరెక్టర్ గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాలనే ఉద్దేశంతో షారుక్ ఖాన్ ఉన్నట్లుగా సమాచారం. పఠాన్ సినిమాతో పాటుగా షారుక్ ఖాన్ ఇంకొక సినిమా కూడా విడుదల చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: