నందమూరి బాలకృష్ణ అఖండ భారీ సక్సెస్ తో ఊపు మీద ఉన్నాడు.ఇక ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దమయ్యాడు. ఇకపోతే ఇప్పటికే గోపీచంద్ మలినేనితో సినిమా మొదలు పెట్టిన బాలయ్య సూపర్ ఫాస్ట్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఎన్.బి.కె 107 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలోని అహోబిలం పుణ్యక్షేత్రం లో జరుగుతోంది. అక్కడి లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా మొదలు కానుంది.ఇకపోతే  ఎఫ్3 విడుదల కాగానే అనిల్సినిమా కసరత్తులు మొదలు పెట్టనున్నాడు. ఇదిలావుండగా అనిల్-బాలయ్య కాంబినేషన్ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.ఇకపోతే ఇవి రెండు సినిమాలు కాకుండానే మరో ముగ్గురు దర్శకులు కూడా బాలయ్య కోసం కథలు సిద్ధం చేసుకొని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే సంపత్ నంది బాలయ్యతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతుండగా.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్న పరుశురామ్ కూడా బాలయ్యతో సినిమాకి ప్రయత్నిస్తున్నాడట.

కాగా గతంలోనే పరుశురామ్ ఓ స్టోరీ లైన్ చెప్పగా బాలయ్య పాజిటివ్ గా స్పందించారట. ఇక ఇప్పుడు అదే లైన్ తో కథ సిద్ధం చేస్తున్నారట.అయితే సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా అయ్యాక ఈ సినిమా చర్చలు మొదలు కానున్నాయి. ఇకపోతే అనిల్ రావిపూడి సినిమాతోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ కూడా ఉండగా ఈ పాత్రలో ఎవరైనా యంగ్ హీరో కనిపించనున్నాడని తెలుస్తోంది.ఇక ఇదిలావుండగా  పరుశురామ్ తో బాలయ్య సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది.ఇకపోతే  ఈ సినిమా పట్టాలెక్కేందుకు సమయం పట్టనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: