ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న సినిమాలన్నింటికీ బడ్జెట్‌ కలిపితే రూ.1000కోట్లకు పైమాటే.ఇకపోతే అలాంటి స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు అవుతుందా? లేదా..? అని ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే  'బాహుబలి' చిత్రాల తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పినట్లు గతంలో ప్రభాస్‌ స్వయంగా వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆయన పెళ్లి విషయం హాట్‌టాపిక్‌గా మారింది.

కాగా ప్రముఖ జ్యోతిషుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ మాత్రం ప్రభాస్‌ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.ఇకపోతే ''నటుడు ప్రభాస్‌ త్వరలోనే వివాహం చేసుకుంటారు. అయితే అక్టోబరు 2022 నుంచి అక్టోబరు 2023 మధ్యలో ఎప్పుడైనా ప్రభాస్‌ పెళ్లి జరగవచ్చు. ఇక ఇది పాన్‌ ఇండియా స్టార్‌ విషయంలో నా జ్యోతిష్యం' అని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి.అయితే మరి వినోద్‌ కుమార్‌ చెప్పినట్లే ప్రభాస్‌ పెళ్లి జరుగుతుందా? లేదా..? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. 

ఇక ఇదిలా ఉంటె మరోవైపు ప్రభాస్‌ నటించిన 'రాధేశ్యామ్‌' ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో ఆయన హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు.కాగా  పూజాహెగ్డే కథానాయికగా... రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. అంతేకాదు వీటితో పాటు ప్రభాస్‌ 'సలార్‌', 'ఆది పురుష్‌', 'ప్రాజెక్టు కె' చిత్రాలతో పాటు మరో చిన్న సినిమాలోనూ నటించనున్నారు.ఆ చిన్న సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ హీరోయిన్ ఎంపికైనట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: