టాలివుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జునకు కొన్ని రోజులుగా ఏ సినిమా తీసినా కూడా అవి విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని బిగ్ బాస్ సీజన్ 5 ను పూర్తీ చేశాడు. గతంలో వచ్చిన సొగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా లో నటించారు. ఆ సినిమానె బంగర్రాజు.. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ ఏడాది లో వచ్చిన టాప్ మూవీ లలో ఒకటిగా నిలిచింది.. ఇప్పుడు మరో కొత్త కథ తో సినిమా చేయనున్నారు నాగర్జున..


నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ది ఘోస్ట్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మొదలై చాలా రోజులు అయ్యింది. అయితే మొదట్లో సినిమాకు హీరోయిన్ కష్టాలు వచ్చినట్లు తెలిసిందే..అయితే కొద్ది రోజులు సినిమా షూటింగ్ ఆగిపొయింది. హీరోయిన్ దొరికిన తర్వాత కరోనా ప్రభావం పెరిగింది. దాంతో మళ్ళీ షూట్ ఆగిపొయింది.


ఇది ఇలా ఉండగా.. సినిమా షెడ్యూల్‌ దుబాయ్‌లో తిరిగి ప్రారంభమైంది. స్పైథ్రిల్లర్‌గా సరి కొత్త కథ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుబాయ్‌ షెడ్యూల్‌లో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా సినిమా లోని ప్రత్యేక సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం వర్కింగ్‌ స్టిల్స్‌ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.'ఓ గూఢచారి కథ ఇది. నాగార్జున పాత్ర చాలా స్టైలిష్ గా, మన్మధుడు లుక్ లో కనిపిస్తారని పోస్టర్ ను చూస్తె అర్థమవుతోంది.. గూఢచారి రహస్య ఆపరేషన్‌ దేని గురించి అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది' అని చిత్రబృందం పేర్కొంది. సోనాల్‌చౌహాన్‌, గుల్‌ పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్‌ జి, నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పై నిర్మిస్తున్నారు.. ఈ సినిమా నాగ్ కు ఎలాంటి టాక్ ను అందిస్తుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: