టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, ట్రెడిషనల్ బ్యూటీ కీర్తి సురేష్ జంటగా 'గీతా గోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్ల డైరెక్షన్ లో నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.క్లాసిక్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇంకా అలాగే 14 రీల్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.అలాగే 'సర్కారు వారి పాట' సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇక ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమా నుంచి వచ్చిన మొదటి పాట 'కళావతి..' సాంగ్ అయితే యూ ట్యూబ్ లో పెద్ద చార్ట్ బస్టర్ హిట్ అయింది. యస్ యస్ తమన్ సంగీత దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు వేసిన స్టెప్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యి బాగా వైరల్ అయింది. 


ఇక యూట్యూబ్ లో కళావతి సాంగ్ ట్రెండింగ్ లో నిలవగా, సోషల్ మీడియాలో ఈ పాటతో పాటు ఆ స్టెప్పు కూడా వైరల్ అయింది. చాలా మంది ఈ సాంగ్ కి రీల్స్ కూడా చేశారు. సెలబ్రిటీలు కూడా సూపర్ స్టార్ మహేష్ వేసిన స్టెప్ వేసి రీల్స్ చేసి సాంగ్ ని మరింత వైరల్ చేశారు.ఇక తాజాగా 'సర్కారు వారి పాట' సినిమా నుంచి రెండో సాంగ్ కూడా రానుంది. పెన్నీ సాంగ్ అంటూ మహేష్ ఫొటోతో పాటు పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. పెన్నీ అంటే డబ్బులు అని మీనింగ్ వస్తుంది. దీంతో ఈ పాట డబ్బుల గురించి ఉండబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. 'సర్కారు వారి పాట' సినిమా నుంచి రెండో సాంగ్ గా ఈ పెన్నీ సాంగ్ మార్చ్ 20 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం వారు ప్రకటించారు. దీంతో అభిమానులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు.మరి ఈ పాట ఎలా ఉండబోతుందో అని అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.కళావతి లాగానే పెద్ద చార్ట్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో ఈ పాట.

మరింత సమాచారం తెలుసుకోండి: