నమ్రతా శిరోద్కర్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రతా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యే ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. పెళ్లికి ముందు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, పెళ్లి తర్వాత మాత్రం అన్ని ఆశలను వదులుకొని భర్త, పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఈ విషయంలో నమ్రతకు సాటిరారు ఎవరు అంటారు మహేష్ అభిమానులు.

మహేష్ బాబు 100% ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు,ఫ్యాన్స్, సెలబ్రెటీలు ఆయనను ఫాలో అవుతూ ఉంటారు. మహేష్ బాబు నుంచి ఈ ఒక్క విషయం నేర్చుకుంటే చాలు చాలా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మహేష్ ప్రతిసారి తన కుటుంబం పట్ల తనకు ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రాధాన్యత ఇస్తారో రుజువు చేస్తూనే ఉంటారు. ఇక భార్య నమ్రత కూడా అలాంటి క్యారెక్టర్ నే తనకు తెలిసిన నాలుగు మంచి విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తనకు తన బిడ్డలు, భర్తే ప్రపంచం. అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నమ్రత ఎన్నో సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులు కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా తన ఫ్యామిలీతో కలిసి గడిపే ట్రిప్స్ విషయంలో కూడా అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది నమ్రత.

 ఈ క్రమంలో నమిత పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ ఫోటోకి ప్రతిరోజు పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటూ తన ఇద్దరు పిల్లల పై ఉన్న ప్రేమ ను మరోసారి పంచుకున్నారు నమ్రత. ఇప్పుడు నమ్రత షేర్ చేసిన ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. క్షణాల్లో ఈ పోస్టుకు లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అంతే కాదు మిగతా హీరోయిన్లు మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మేడం అంటూ నమ్రతను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: