టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ హీరో (ఎస్ ఎం ఎస్)  శివ మనసులో శృతి మూవీ తో హీరో గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను సాధించుకోవడంతో పాటు సుధీర్ బాబు కు కూడా ఈ మూవీ మంచి గుర్తింపు ను తీసుకుని వచ్చింది,  (ఎస్ ఎం ఎస్) శివ మనసులో శృతి మూవీ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ బాబు ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం మూవీ తో  మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్  దగ్గర అందుకున్నాడు.  ప్రేమ కథ చిత్రమ్  మూవీ తో  మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సుధీర్ బాబు కు ఆ తర్వాత మాత్రం చెప్పుకోదగ్గ విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు,  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సుధీర్ బాబు 'శ్రీ దేవి సోడా సెంటర్'  మూవీ తో  ప్రేక్షకులను పలకరించాడు.

 కాకపోతే ఈ సినిమా కూడా సుధీర్ బాబు కు బాక్స్ ఆఫీస్  దగ్గర నిరాశనే మిగిల్చింది,  ఇది ఇలా ఉంటే సుధీర్ బాబు ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో  హీరో గా నటిస్తున్నాడు.  ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి  కథానాయికగా నటిస్తోంది,  ఇలా ప్రస్తుతం ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సుధీర్ బాబు మరో కొత్త సినిమాను పట్టాలెక్కించాడు.  భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీ కి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు,  ఈ మూవీ సుధీర్ బాబు కెరియర్ పరంగా 16 వ సినిమా,  ఇలా సుధీర్ బాబు ఒక సినిమా సెట్స్ పై  ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: