భారతీయ సినిమాల కన్నా అందులో వచ్చే డైలాగులు, సీన్లు బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెట్ డేవిడ్ వార్నర్ తెలుగు డైలాగుల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుచేతనే ప్రతి హిట్ సినిమా లోని సన్నివేశాలను తన ఇంస్టాగ్రామ్ లో రిల్స్ చేస్తూ ఉంటారు. డేవిడ్ వార్నర్ తెలుగు భాషలో సహా ఇతర ఇండియా సినిమా లోని పాటలు ,డైలాగులను స్పూఫ్ చేస్తూ ఆ వీడియోలను బాగా పాపులారిటీ చేస్తూ ఉంటాడు. వార్నర్ చేసిన ఏ వీడియో అయినా సరే లక్ష్యాల్లో వ్యూస్ ని అందుకుంటూ ఉంటుంది.

బుట్ట బొమ్మ సాంగ్ నుంచి మొదలు ఇటీవల వచ్చిన పుష్ప సినిమా వరకు అన్ని చిత్రాలలోని సన్నివేశాలను చేస్తూ ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటాడు వార్నర్. అయితే గత కొంత కాలం నుంచి గ్యాప్ ఇచ్చిన వార్నర్ తాజాగా మరో సరికొత్త వీడియో తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇటీవల విడుదలైన.. కే జి ఎఫ్-2 సినిమాలోని డైలాగ్ ను స్పూఫ్ చెస్తు ఒక వీడియోని విడుదల చేశారు. ఇక వీడియో లోకి వస్తే ట్రైలర్ లో వచ్చిన వైలెన్స్ డైలాగ్ ని.. వార్నర్ ప్యారడీ చేయడం జరిగింది.


అలా చేసిన వీడియో ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా విడుదల చేయడంతో అది చాలా వైరల్ గా మారుతుంది. ఇక అంతే కాకుండా ఈ డైలాగ్ ను తన బ్యాక్డ్రాప్లో తన బ్యాటింగ్ చేస్తున్న వీడియోకు సెట్ చేసి విడుదల చేశారు. ఇక గత సంవత్సరం సన్రైజర్స్ హైదరాబాద్ వార్నర్ ను వదులుకోవడం తో తాజా వేలంపాటలో ఢిల్లీ క్యాపిటల్ గా అతడిని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపుగా రూ.6.25 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నారు వార్నర్ ని. అయితే ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: