గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు చేయాలంటే ఆలోచించే వాళ్లు. అభిమానుల్లో విభేదాలు వస్తాయని, ఫ్యాన్ ఫాలొయింగ్ తగ్గుతుందని అభిప్రాయ పడేవారు. ప్రస్తుతం ఆ అభిప్రాయం మారిందనే చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ సినిమాలు భారీగానే విడుదలయ్యాయి. ఆ సినిమాలు విడుదలై భారీ విజయాన్నే అందుకున్నాయి. సింగిల్ హీరోతో తీసే సినిమాల కంటే.. ఇద్దరు హీరోలతో కలిసి తీసే సినిమా భారీ వసూళ్లు రాబట్టుతున్నాయి. దీంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు.


‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో హీరోలుగా మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ నటించారు. ఇందులో ‘చిన్నోడు-పెద్దోడు’ అనే కాన్సెప్ట్ తరహాలోనే పలు సినిమాలు కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. స్టోరీ డిమాండ్ తగ్గట్లూ ఇద్దరు హీరోలను సెట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. చిరు-సల్మాన్ కాంబినేషన్‌లో ఒక పాట కూడా ఉండనున్నట్లు సమాచారం.


అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో హీరోకు తోడుగా మాస్ మహారాజ్ రవితేజను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే మలయాళ మూవీ ‘బ్రో డాడీ’ రీమేక్‌లో చిరు తనయుడి పాత్ర కోసం సాయిధరమ్ తేజ్ పేరు వినిపిస్తోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వినోద సితం’ తమిళ రీమేక్‌లో కూడా తేజ్ పేరు ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలో కూడా సెకండ్ హీరో కావాలని అనుకుంటున్నారట.


సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా మల్టీస్టారర్ సినిమాలపై కన్నేశారు. త్రివిక్రమ్-మహేశ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో సైడ్ హీరో కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. మహర్షి సినిమాలో సైడ్ హీరోగా నటించిన అల్లరి నరేష్ లాంటి రోల్ కోసం.. ఇప్పటికే పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే హీరో అజిత్ కుమార్ నటించిన ‘వలిమై’ చిత్రంతో హీరో కార్తీకేయ నటించారు. దీనికి కారణం తెలుగు ఆడియన్స్ సపోర్ట్ దక్కించుకోవడానికే. ఇలా తెలుగు స్టార్ హీరోలు కలిసి పని చేస్తేనే ఆదాయం అన్నట్లు డిసైడ్ అవుతున్నారు. అలా మల్టీస్టారర్ సినిమాలపై వైపే తమ మద్దతు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: