మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా పూజ హెగ్డే నటిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో  ఈ సినిమా ను మొదలు పెట్టి చా లా రోజులు అవుతున్నా కూడా ఇప్పటిదాకా విడుదల చేయకపోవడంపై మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల కావడానికి అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకుంది.

తెలుగునాట మెగాస్టార్ చిరంజీవికి భారీస్థాయిలో క్రేజ్ వున్న సంగతి అందరికి తెలిసిందే కోట్లాది మంది అభిమానులు ఆయనకు ఉంటారు ఈ నేపథ్యంలోనే చిరంజీవితో ఈ సినిమాను సోలోగా తీసుకురావాలని చెప్పి ఇన్నాళ్లు విడుదల చేయకుండా ఉంచాడు. మధ్యలో పలుమార్లు ఈ సినిమాను విడుదల చేయాలని ప్రయత్నాలు చేసి మానుకున్నాడు మరి ఈసారి ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి ఉంటుందా అనేది చూడాలి సామాజిక నేపథ్యంలో ని సినిమాలను కమర్షియల్ చిత్రాలు గా తెరకెక్కించి  మంచి విజయాలను అందుకునే దర్శకుడైన కొరటాల శివ ఈసారి మంచి సినిమాను చేస్తున్నాడు అని చెప్పవచ్చు.

సైరా నరసింహ రెడ్డి లాంటి భారీ విజయం తర్వాత హీరో చేస్తున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలియాలి అంటే రేపు ఈ సినిమా విడుదలయ్యే ఇంతవరకు ఎదురు చూడాల్సిందే.  చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ పండుగను మెగా అభిమానులు మాత్రం భారీ స్థాయిలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలోని పాటలు అలాగే ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో అంచనాలను అందుకున్నాయి. మరి ఇన్నాళ్లు ఎదురు చూసిన అభిమానుల కోరిక ఈ సినిమా తీస్తుందా అధికారులను దక్కించుకుంటుందా చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: