తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథతో ఎప్పుడూ తమ అభిమానులను అలరిస్తూ ఉంటాడు హీరో నితిన్. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా దూసుకుపోతున్నాడు హీరో నితిన్. రీసెంట్ గా రంగ్ దే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నితిన్ హీరోగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పక్కా మాస్ చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి , నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో నితిన్, సిద్ధార్థ రెడ్డి అనే ఒక IAS పాత్రలో నటించనున్నారు.

ఈ చిత్రాన్ని ముందుగా జూలై 8 వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర యూనిట్. అయితే కొన్ని పనులు పెండింగ్లో ఉండటంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయడం జరిగింది. దీంతో మాచర్ల నియోజకవర్గం కొత్త సినిమా తేదీన విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. తాజాగా ఈ విషయాన్ని ఈ రోజున రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఒక పోస్టు ద్వారా తెలియజేశారు.ఇందులో నితిన్ లుక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. మాస్ లుక్స్ తో ఈ పోస్టర్ లో నితిన్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు భారీ రెస్పాన్స్ లభించింది. ఇదివరకు చిత్రాల కంటే ఈ చిత్రంలో చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాని ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ గా పని చేస్తూ ఉన్నారు. ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లూ సమాచారం. ఇందులో హీరోయిన్లుగా కృతి శెట్టి, కేథరిన్ నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: