
ఇక వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు విడిపోయినప్పటికీ ఇద్దరూ ఒకరినొకరు స్నేహపూర్వకంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారని న్యాయస్థానం తెలియజేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ లో చిన్నవాడైన సోహైల్ నటుడు గా మారడానికి ముందే డైరెక్టర్ గా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత రైటర్ గా, నిర్మాతగా సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ప్యార్ కియా తో డర్నా క్యా సినిమా షూటింగ్లో సమయంలో సీమా ను కలవడం జరిగింది.
వీరిద్దరి అభిప్రాయాలు అభిరుచులు ఒకటి కావడంతో వీరిద్దరూ ప్రేమలో పడి 1998లో వివాహం చేసుకున్నారు వీరికి నిర్వన్, మోహన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకొబో తున్నారే వార్త వైరల్ గా మారింది అయితే సీమా వాటిని ఖండించడం జరిగింది. ఎటువంటి కుటుంబంలోనే అయినాసరే మనస్పర్ధలు సహజమని తమకు అన్నింటికంటే తమ పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం అని తెలియజేసింది. అయితే ఇప్పుడు తాజాగా వీరు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం తో ఈ విషయం బాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. వీరిద్దరికీ సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.