
అయితే వైజాగ్ ఘటన నుంచి హైపర్ ఆది వాళ్ళిద్దర్నీ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఆ తర్వాత జబర్దస్త్ షో లో వీళ్ళిద్దరికీ అవకాశాలు ఉండవు అని అంతా అనుకున్నారు. కానీ ఆ ఇద్దరిని ఆది స్కిట్ లో పెట్టుకోవడం జరిగింది. ఇక ఆ ఘటన మీదే స్కిట్ లు రాసుకుంటూ.. సెటైర్లు వేసుకుంటూ ముందుకు వచ్చారు. పరదేశి మీద ఎప్పుడూ కూడా వైజాగ్ సంఘటనను ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఆ సంఘటనలు మితిమీరిపోతూ ఉంటాయి. కానీ ఆ ఇద్దరూ ఏమాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం.
అంతేకాదు వీరిద్దరు చెప్పే మాటలు ఏమిటంటే.. అలా ఆది కౌంటర్లు వేసినప్పుడే తాము మరింతగా ఫేమస్ అవుతాము అని చెబుతూ ఉంటారు. ఒక స్కిట్ లో భాగంగా పరదేశి కొన్ని కామెంట్లు చేశారు.. ఇక ఈ క్రమంలోనే మాంత్రికురాలు గా రోహిణి కనిపించింది. దెయ్యం పట్టిన వాడిలా పరదేశి నటించాడు. ఇక ఈ క్రమంలోనే రోహిణి వీడి మీద ఇంకా ఏదో కేసు ఉంది అని రోహిణి అనగానే.. అప్పుడు పరదేశి అవును నా మీద ఇంకా రెండు కేసులు ఉన్నాయి.. ఇంకా వాటిని కొట్టి వేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.