కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తళపతి విజయ్ తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ లో  హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తళపతి విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ సినిమాను తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన బీస్ట్ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది.

అలా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోవడంతో బీస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్  మూవీ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే సినిమా ఎలా ఉన్నా... ఈ సినిమా లోని అరబిక్ కుతు సాంగ్ మాత్రం ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా నుండి విడుదల చేసిన అరబిక్ కుతు లిరికల్ వీడియో సాంగ్ ఇండియా వ్యాప్తంగా ఫుల్ వైరల్ అయ్యింది. ఈ సాంగ్ ద్వారా కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. లిరికల్ వీడియో సాంగ్ తోనే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ పాట, సినిమా విడుదల తర్వాత వీడియో సాంగ్ కి కూడా ఫుల్ క్రేజ్ లభించింది.అలా ప్రేక్షకుల్లో ఫుల్ ను సంపాదించుకున్న ఈ సాంగ్ ఫుల్ వీడియో ను కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. 

వీడియో సాంగ్ కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ ను సాధించింది. అలాగే ప్రస్తుతం కూడా ఈ సినిమా లోని ఈ వీడియో సాంగ్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ కు శివ కార్తికేయన్ లిరిక్స్ రాయగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: