పూజా హెగ్డే ఎప్పటినుంచో బాలీవుడ్‌లో స్టార్డమ్‌ సంపాదించాలని ప్రయత్నం చేస్తోంది. హృతిక్‌ రోషన్‌తో 'మొహంజదారో' చేస్తోన్న సమయంలో తెలుగు సినిమాలని కూడా పక్కనపెట్టింది. 'మొహంజదారో' హిట్‌ అయితే అక్కడే సెటిల్‌ అవ్వాలని ప్లాన్ చేసుకుంది. కానీ కథ అడ్డం తిరిగింది. 'మొహంజదారో' డిజాస్టర్‌ అయింది.  బాలీవుడ్‌ జనాలు పూజాని లైట్‌ తీసుకున్నారు. ఇక కలలు కన్న బాలీవుడ్ కాదనడంతో పూజా మళ్లీ టాలీవుడ్‌కి వచ్చింది. 'డీజే'తో పరుగు మొదలుపెట్టింది.

పూజాహెగ్డేకి 'అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్‌'తో హిట్‌ రాగానే మళ్లీ బాలీవుడ్‌కి వెళ్లింది. 'హౌస్‌ఫుల్-4' చేసింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాపుల్లో కలిసిపోయింది. 'అల వైకుంఠపురములో, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్' హిట్స్ చూసి ప్రభాస్‌ 'రాధేశ్యామ్'లో ఆఫర్ ఇచ్చాడు. పాన్‌ ఇండియన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన 'రాధేశ్యామ్' ఢమాల్ అంది. పూజా హిందీ కలని కల్లలు చేసింది.

పూజాహెగ్డేకి హిందీలోనే కాదు ఈ మధ్య సౌత్‌లోనూ ఫ్లాపులొస్తున్నాయి. కోలీవుడ్‌ టాప్ స్టార్ విజయ్‌తో చేసిన 'బీస్ట్‌' డిజాస్టర్‌ అయ్యింది. రామ్‌ చరణ్‌తో చేసిన 'ఆచార్య' కూడా గల్లంతయ్యింది. ఈ హ్యాట్రిక్‌ డిజాస్టర్స్‌తో డౌన్‌ అయిన పూజ తెలుగులో మహేశ్‌బాబుతో ఒక సినిమా, విజయ్‌ దేవరకొండతో 'జనగణమన' చేస్తోంది. ఈ మూవీస్‌తో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలని ఆశ పడుతోంది పూజ.

పూజా హెగ్డే బాలీవుడ్ డ్రీమ్స్‌ సజీవంగా ఉండాలంటే అక్కడ భారీ హిట్‌ పడాలి. లేకపోతే గేమ్‌ నుంచి అవుటై పోతుంది. ఈ పరిస్థితుల్లో సల్మాన్‌ ఖాన్‌తో 'కభీ ఈద్ కభీ దీవాళి', రణ్‌వీర్‌ సింగ్‌తో 'సర్కస్' చేస్తోంది. అయితే సల్మాన్‌కి 'రాధే, అంతిమ్' ఫ్లాపులతో మార్కెట్‌ దెబ్బతింది. రణ్‌వీర్ 'జయేష్‌భాయ్ జోర్దార్'తో బోల్తాపడ్డాడు. మినిమం ఓపెనింగ్స్‌ కూడా తెచ్చుకోలేకపోయాడు. ఇలా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు, ఫ్లాపుల పూజాని ఎంత వరకు ఆదుకుంటారనేేది చూడాలి. చూద్దాం.. పూజా ఆశ ఎంత వరకు నెరవేరుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: