మలయాళం లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఫహద్ ఫాజిల్. అక్కడ ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారాయన. 'పుష్ప' సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.


ఈ సినిమాలో ఆయన విలన్ గా నటించారు. ఇప్పుడు ఆయన తన కెరీర్ పరంగా ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఫహద్ ఫాజిల్ సోలోగా నటించిన చివరి సినిమా 'ట్రాన్స్'. 2020లో ఆ సినిమా విడుదలైందట.. కేరళ లో ఇదొక బ్లాక్ బస్టర్. ఆ తరువాత ఫహద్ నటించిన నాలుగు సినిమాలు వరుసగా ఓటీటీలో నే విడుదలయ్యాయి.


'సీయూ సూన్', 'ఇరుల్', 'జోజి', 'మాలిక్' ఇవన్నీ కూడా ఓటీటీలో విడుదల అయ్యాయి. ఈ సినిమాలన్నీ కూడా బాగానే ఆడాయి. కొన్ని భాషల కు రీమేక్ హక్కులను కూడా అమ్మేశారు. నేరుగా డిజిటల్ రిలీజ్ కు ఇవ్వడం తో దాదాపు వంద కోట్లకు పైగా నే థియేటర్ బిజినెస్ పోగొట్టాడని ఫహద్ ఫాజిల్ మీద అక్కడ డిస్ట్రిబ్యూటర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నటించిన మరో సినిమా మలయన్ కుంజు ని కూడా ఓటీటీకి ఇచ్చేశారట.ఆయన బిగ్ స్క్రీన్ పై కనిపించింది కూడా 'పుష్ప', 'విక్రమ్'లో మాత్రమే.


 


వాటిలో అల్లు అర్జున్ మరియు కమల్ హాసన్ హీరోలుగా నటించారు. ఫహద్ నటించిన సినిమాలన్నీ ఓటీటీలకు ఇస్తుండడంతో అతడి మీద ఎగ్జిబిటర్స్ లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇక పై అతడి సినిమాలు కొనమని నిర్ణయం తీసుకోవాలన్నా.. వేరే హీరోల కాంబినేషన్ లో నటిస్తుండడంతో భరిస్తున్నార ట ఎగ్జిబిటర్లు, బయ్యర్లు. తనపై నెగెటివిటీ కూడా పెరుగుతున్నా..


 


ఫహద్ ఫాజిల్ మాత్రం దేన్నీ కూడా పట్టించుకోవడం లేదు. తన నెక్స్ట్ సినిమా 'పుష్ప2' కోసం రెడీ అవుతున్నారట.. సెకండ్ పార్ట్ లో అతడి పాత్ర ఎంతో కీలకం గా ఉండబోతుంది. దీని కోసం చాలా రోజుల పాటు కాల్షీట్స్ కేటాయించబోతున్నారట ఫహద్ ఫాజిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: