
ఫస్ట్ డే ఈ సినిమా ప్రీమియర్ షోలతో కలిపి మొత్తం రూ .89 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా ఈ ఏడాది నిలిచింది. అంతేకాకుండా హీరో రిషబ్ శెట్టి కెరియర్ లో కూడా అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. కాంతార చాప్టర్1 రెండవ రోజు కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టినట్లు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం రెండవ రోజు రూ. 43.65 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లుగా వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.105 కోట్లకు పైగా రాబట్టింది.
ఈ వారంలో కాంతార చాప్టర్1 సినిమాకి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది కన్నడ సిరి పరిశ్రమలో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది. ఇందులో రుక్మిణి వసంత్, జయరామ్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రకృతి, దేవుడు, ప్రజల జీవితాల నమ్మకాల ద్వారా ముడి పడినటువంటి కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అందరి నటన అద్భుతంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి కాంతారా చాప్టర్ 1. సినిమా చివరిలో కాంతారా చాప్టర్ 2 ఉంటుందనే విధంగా హింట్ ఇచ్చారు చిత్ర బృందం.