కే జి ఎఫ్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు హీరో యశ్. అప్పటిదాకా కన్నడ చిత్ర పరిశ్రమకే పరిమితమై సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఈ చిత్రం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను మైమరిపించారు అని చెప్పాలి.  కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయన చిత్రాలు దేశవ్యాప్తంగా అన్ని భాషలలోకి వెళ్లాయి. కానీ అప్పుడు రాని గుర్తింపు కాస్తాయి కేజీఎఫ్ సినిమాతో వచ్చి భారీ హీరోగా మారిపోయాడు.  ఇప్పుడు పాన్ ఇండియా హీరోల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న యశ్ ఇప్పుడు చేయబోయే సినిమాతో మళ్లీ రికార్డులను కొల్లగొట్టాలని భావిస్తున్నాడు.

ప్రశాంత నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతటి రికార్డులను సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి లాంటి సినిమా రికార్డులను ఇది కొల్లగొట్టి మంచి రికార్డు సొంతం చేసుకుంది. ఈ నేపద్యంలో రికార్డులతో కాదు అవకాశాలతోనే ఈ సినిమాలో నటించిన వారు పై చేయి సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలే వస్తున్నాయని చెప్పాలి. దర్శకుడు కూడా తెలుగు హీరోలతో వలస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి కూడా అన్ని భాషలలోనూ మంచి మంచి అవకాశాలను అందుకుంటు ఉంటుంది.

ఆ విధంగా ఈమె కెరియర్ ఇప్పుడు సెట్ అయిందని చెప్పాలి. త్వరలోనే ఆమె తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పెద్ద హీరో నటించబోయే సినిమాలో ఈమెకు ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది మరి మంచి సక్సెస్ను సాధిస్తే అవకాశాలు వాటి అంతట అవే వస్తాయి అనడానికి శ్రీనిధి శెట్టి చేసిన ఈ సినిమానే నిదర్శనం. భవిష్యత్తులో ఆమె తన విజయ పరంపరను కొనసాగించి అగ్ర హీరోయిన్ గా అన్ని సినిమా పరిశ్రమలలో కొనసాగుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం తమిళనాడు ఈ ముద్దుగుమ్మకు మంచి అవకాశాలు వస్తున్నాయి అక్కడ యువ హీరోలతో కలిసి నటిస్తున్న శ్రీనిధి శెట్టి త్వరలోనే పెద్ద హీరోల సినిమాలు కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: