ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కస్తూరి శంకర్. నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఆధ్యాత్నిక చిత్రం అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన కస్తూరికి చాలా మంచి మార్కులే పడ్డాయి.ఈ సినిమా తర్వాత తమిళ్ లో వరుస అవకాశాలతో అక్కడే సెటిల్ అయ్యింది. కాగా ప్రస్తుతం తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ఆమె మెయిన్ లీడ్ లో నటిస్తోంది. ఇక హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే సీనియర్ నటి కస్తూరి శంకర్ ఒకప్పుడు టాలీవుడ్లో పలు చిత్రాలలో కూడా నటించింది.కాగా కస్తూరి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోలను షేర్ చేస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది. ఇంకా అలాగే పలు కామెంట్స్ కూడా చేస్తుంటుంది. ఇటీవల క్రికెటర్ కే ఎల్ రాహుల్ నటించిన అండర్ వేర్ యాడ్ పై ఆమె కామెంట్స్ చేసింది. క్రికెటర్లు డ్రింక్స్, ఫుడ్ ఇంకా ఆన్లైన్ గేమ్స్ వంటి యాడ్స్ లలో నటించారని.. కానీ అండర్వేర్ యాడ్స్ లో నటించడానికి గట్స్ కావాలని ఆమె చెప్పుకొచ్చింది. రాహుల్ ఇలాంటి యాడ్ లో నటించడం చాలా గ్రేట్ అంటూ చెప్పుకొచ్చింది.


అయితే కస్తూరి పలు కాంట్రవర్సీలతోనే బాగా ఫేమస్ అయ్యింది. సినీ పరిశ్రమలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ఆమె స్పందిస్తూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.అయితే ఇటీవల కస్తూరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వయసు పైబడిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమెకు లవ్ ఎఫైర్ ఉందని దాంతో ఆ వ్యాపారవేత్త కస్తూరికి కోట్ల రూపాయలు విలువచేసే గిఫ్ట్ లు కూడా ఇచ్చాడని తెగ ప్రచారాలు చేశారని తెలిపింది. దాంతో ఇక ఆ బిజినెస్ మెన్ ని కలిసినప్పుడు కస్తూరి లవ్ ఎఫైర్ గురించి మాట్లాడిందంట. దీని గురించి మాట్లాడుకుంటూ సరదాగా వారు నవ్వుకున్నామని తెలిపింది. అయితే కొంతమంది తన వ్యక్తిత్వం నచ్చక ఇలా తన గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు అనేవి చేస్తున్నారని.. ఇలాంటి వాటిని పట్టించుకోనని ఆమె స్పష్టం చేసింది.
మరింత సమాచారం తెలుసుకోండి: