మాస్ మహారాజా రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రాజిష విజయన్ ,  దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా నటించగా , ఈ సినిమాకు శరత్ మండువ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి కూడా నటించాడు. ఈ సినిమాను జూలై 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం,  అలాగే ఈ సినిమాలో రవితేజ సబ్ కలెక్టర్ పాత్రలో నటిస్తూ ఉండడం ఇలా అనేక కారణాల వల్ల ఈ సినిమాపై మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ లోని సభ్యులు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ దర్శకుడు శరత్ మండువ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని,  ఈ మూవీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ ... ఈ సినిమా ఆద్యంతం ఎంతో ఆకట్టుకునే కథాంశంతో సాగుతుందని అన్నారు.

ముఖ్యంగా ఈ మూవీ లో హీరో రవితేజ పాత్ర కి రామారావు అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం అన్న ఎన్టీఆర్ గారు అని శరత్ మండువ చెప్పారు.   ఎన్టీఆర్ పేరు  తెలియనివారు ఎవరు ఉండరని, ప్రస్తుత జూనియర్ ఎన్టీఆర్ , తెలంగాణ మంత్రి కేటీఆర్ వరకు ఈ పేరును  పెట్టుకున్న వారందరూ కూడా ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉన్నారని,  అందుకే ఆ పేరుని రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో హీరో క్యారెక్టర్ కి పెట్టడం జరిగిందని తాజా ఇంటర్వ్యూలో శరత్ మండువ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: