టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి 'కొత్త కొత్త గా' అనే వీడియో సాంగ్ ని ఆగస్ట్ 23 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో సుధీర్ బాబు మరియు ప్రతి శెట్టి లు ఉన్నారు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే గతంలోనే సుధీర్ బాబు ,  ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో సమ్మోహనం , వి మూవీ లు తెరకెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: