నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఒక సినిమా వస్తోంది అని అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచే ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది అన్న ప్రచారం మొదలైంది. చిత్ర యూనిట్ కూడా ఈ న్యూస్ నీ ఖండించకపోవడంతో రజినీకాంత్ సరసన తమన్నా జోడి కట్టడం పక్కా అని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ వార్తలకు చెక్ పడింది అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా షూటింగ్ స్టార్ట్ చేసిన జైలర్ టీం రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ లుక్కుతో పాటు కాస్ట్ డీటెయిల్స్ ని కూడా షేర్ చేసింది. ముఖ్యంగా రమ్యకృష్ణ, యోగి బాబు , వసంత్ రవి, వినాయకన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అని క్లారిటీ కూడా ఇచ్చింది చిత్ర బృందం. అయితే హీరోయిన్ ఎవరన్న విషయాన్ని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు.

ఇక తాజాగా ఇచ్చిన అనౌన్స్మెంట్తో జైలర్ సినిమాలో తమన్నా హీరోయిన్ అన్న వార్తలకు పులిస్టాప్ పడినట్లే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక హీరోయిన్ ఫిక్స్ అయి ఉంటే ఈపాటికి అనౌన్స్ చేసేవారు కదా మరి తమన్నా హీరోయిన్ అన్న న్యూస్ కేవలం రూమర్ మాత్రమే అంటూ కొట్టి పారేస్తున్నారు. ఇకపోతే ఈ అప్డేట్ విన్న తర్వాత తమన్నా మాత్రమే కాదు ఆ మీ అభిమానులు కూడా తీవ్రంగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇకపోతే తమన్నా తెలుగులో సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి హీరోగా నటిస్తున్న  భోళా శంకర్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాల తర్వాత ఈమె మరిన్ని తమిళ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.ఏదేమైనా జైలర్ సినిమాలో ఈమె అవకాశాన్ని కోల్పోవడం నిజంగా బ్యాడ్ న్యూస్ అంటూ అభిమానులు హర్ట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: