బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్‌ జోహార్‌ గురించి మనకి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈయన  హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షో లో శృంగారం యొక్క ప్రస్తావన లేకుండా కార్యక్రమం సాగడం లేదు.ఇకపోతే ఆయన ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో శృంగారం టాపిక్ తీసుకు వచ్చి షో కి వచ్చిన గెస్ట్ లతో ఆ టాపిక్ గురించి మాట్లాడిస్తున్నాడు.దీనికి సంబంధించి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తన షోలో ఆ విషయాన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్న కరణ్ తాజా ఎపిసోడ్ లో కూడా అదే కంటిన్యూ చేశాడు.

అయితే  బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ గెస్ట్ గా తాజా ఎపిసోడ్ కోసం వచ్చాడు.ఇక ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.ఏంటంటే... 65 ఏళ్ల వయస్సులో అనిల్ కపూర్ లుక్ మరియు ఆయన ఉత్సాహం చూస్తే ఆశ్చర్యమేస్తుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అంతేకాదు తాత కాబోతున్న అనిల్ కపూర్ ఇంకా కూడా యంగ్ గా కనిపించడం కు కారణం ఏంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు.ఇక దానికి ఆయన కరణ్‌ షో లో ఆసక్తికర సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరిచాడు.

అయితే తాను ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా అందంగా కనిపించడానికి కారణం కేవలం సెక్స్ అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు.ఇకపోతే సెక్స్ వల్లే తాను నిత్య యవ్వనుడిగా ఉంటున్నానని తెలియజేసి చర్చలో నిలిచాడు. కాగా అనిల్ కపూర్ శృంగారం గురించి ఇంకా మాట్లాడుతూ.. మీరు మీ భార్యను మెచ్చుకోవాలి ఆమెకు సంతోషాన్ని కలిగించే పనులు మాత్రమే చేయాలి.అయితే అప్పుడే ఆమె మిమ్మల్ని ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచిస్తుంది. ఇక అలా శృంగారంలో కచ్చితంగా ఎంజాయ్ చేయవచ్చు అంటూ యువతకు అనిల్ కపూర్ ఈ వయసులో సలహాలు ఇస్తున్నాడు.అయితే  మొత్తానికి ముసలోడే గాని మహానుభావుడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: