టాలీవుడ్ తెరపై సందడి చేసిన ఎంతోమంది హీరోయిన్లలో హీరోయిన్ సంగీత కూడా ఒకరు... ఈమె తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో ఒకానొక దశలో చాలా బిజీ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇక ఖడ్గం సినిమాలో ఈమె నటనకు ఎంతోమంది ప్రేక్షకులు సైతా ఫిదా అని చెప్పవచ్చు. ఇక తర్వాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసింది సంగీత. అయితే సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రంతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆమెకు తగ్గ పాత్రలు చేస్తే బిజీగా ఉన్నది తాజాగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొనండి సంగీత.


సంగీత మాట్లాడుతూ.. తను చిన్న వయసు నుంచి చాలా లావుగా ఉండే దానిని తెలియజేసింది. అంతేకాకుండా స్కిన్ కి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి జువెలరీ అంటే నాకు అసలు పడదు ఎలర్జీ వచ్చేస్తుందని అప్పట్లో నేను ఎవరితో కూడా ఎక్కువసేపు కలిసి ఉండేదాన్ని కాదని తెలియజేసింది. షూటింగ్ కు రావడం యాక్టింగ్ చేయడం ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోవడం వంటివి మాత్రమే తనకు తెలుసని తెలియజేసింది. అయితే ఒక నటిగా అలా ఉండకూడదని తనకు అనిపించలేదని జనంలో ఎప్పుడు కనిపిస్తూ ఉండాలని ఆలోచన కూడా తనకి రాలేదని అందు వలనే నేను హీరోయిన్గా తక్కువ సినిమాలు చేశానని తెలియజేసింది.


అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉండే వారికి అందరికీ టచ్ లోనే ఉండాలి.. ఒక యాక్టర్ కి ఎంతోమంది ప్రొడక్షన్ హౌస్ లతో కనెక్షన్ ఉంటుంది.. కానీ ఇండస్ట్రీలో నాకు ఎవరితో కూడా అంతగా నెట్వర్క్ ఉండేది కాదని.. ఈ విషయంలో తను చాలా వీక్ అని తెలియజేసింది. ఎక్కువగా తన సినిమా గురించి తప్ప ఎప్పుడూ ఎలాంటి విషయం గురించి కూడా ఆలోచించనని తెలియజేసింది సంగీత. నీకు సంగీత కి స్కిన్ సమస్యల వల్ల తెరపైకి చాలా లావుగా కనిపించడం చూసి తన తల్లితోనే ఆమె సినిమాలు చేయనని చెప్పేసిందట. అయినా కూడా అవకాశాలు రావడంతో తన సినిమాలలో నటిస్తూ ఉన్నారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: