
ఇక ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బాణీలు కూడా సినిమాకి అదనపు బలం అయ్యాయి. "తమన్ మ్యూజిక్ + పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్" కాంబినేషన్ ఈ ప్రాజెక్ట్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక సినిమాలో ఈ స్థాయి ఎమోషన్, హై వోల్టేజ్ సీన్స్, కల్ట్ బ్లాక్‌బస్టర్ ఫీలింగ్‌ను అనుభవించారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట ఒకే మాట – “OG 2” గురించే. ఈ సినిమా ఓజీ యూనివర్స్‌లో భాగం కానుందని బలంగా ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా సోషల్ మీడియాలో మరో హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే – నాని – సుజిత్ కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతోందట.
వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కి కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌నే తీసుకోవాలని ఫిక్స్ చేశారట. పూజా కార్యక్రమాలు విజయదశమి రోజున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఇప్పటికే ఒక పవర్‌ఫుల్ టైటిల్ కూడా రిజిస్టర్ అయ్యిందని సమాచారం . అదే “బ్లడీ రోమియో”. ఇది ఒక మల్టీస్టారర్ మూవీ అవుతుందట. ఇందులో విలన్‌గా నటించేది ఎవరో తెలుసా? మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ కుమార్. ఆయన పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నారని టాక్.
ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న ఫార్ములా ఏమిటంటే – హీరో అంటే హీరో, విలన్ అంటే విలన్. కానీ సుజిత్ మాత్రం ఆ రూల్‌ని పూర్తిగా బ్రేక్ చేసి, హీరోలోనే ఉన్న విలన్ షేడ్స్‌ను బయట పెట్టే సీన్స్ రాయడానికి రెడీ అవుతున్నాడట. ఇది నిజంగా చాలా పెద్ద రిస్క్. కానీ సుజిత్ తీసుకునే రిస్క్‌కి ఫలితం మాత్రం బ్లాక్‌బస్టర్ గానే వస్తుందనే నమ్మకం ఇండస్ట్రీలో క్రియేట్ అయింది. ప్రస్తుతం ఓజి సక్సెస్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సుజిత్, ఇలాంటి బిగ్ ఐడియాస్‌తో ఇండస్ట్రీలో కొత్త రూల్స్ సెట్ చేస్తూ వెళ్తున్నాడు. నిజంగా ఒక డైరెక్టర్‌గా ఆయన దైర్యం, ఆలోచన విధానం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.