ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో నాలుగు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని మంచి విజయాలను కూడా బాక్సాఫీస్ దగ్గర సాధించాయి. ఆ నాలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం. దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం సినిమా ఆగస్టు 5 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరిన్ , సంయుక్తా మీనన్ హీరోయిన్ లుగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో తనకెక్కిన బింబిసార మూవీ ఆగస్టు 5 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13 వ తేదీన విడుదల అయ్యింది.  ఈ మూవీ కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ని తెచ్చుకొని ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను సాధించింది. శర్వానంద్ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయ్యి , ప్రేక్షకుల నుండి మంచి టాక్ ని తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: