
ఈ సినిమాలో పాయల్ ని నటనపరంగా బాగా ఉపయోగించుకున్నారని సినిమా ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతుంది. అందుచేతనే ఈమె ఫోకస్ అంతా ఎక్కువగా గ్లామర్ మీద కాకుండా పాత్ర మీద పెట్టడం జరిగింది. కోనా వెంకట్ కథ తో సూర్య డైరెక్షన్ లో వస్తున్న జిన్నా చిత్రం లో పాయల్ తో పాటు సన్నీలియోన్ కూడా నటిస్తున్నది ఇద్దరు ముద్దుగుమ్మలు రొమాంటిక్ చిత్రం జిన్నా ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి. ఒకపక్క హీరోగా మంచు విష్ణు కి ఈ సినిమా కూడా హిట్ సాధించాల్సి ఉన్నది.
ఇక పాయల్ సినీ కెరియర్ పరంగా చాలా క్రిటికల్ కండిషన్లో చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ తో మరొకసారి తన హవా అని కొనసాగిస్తుందేమో చూడాలి.. ఇక సన్నీ లియోన్ కూడా గతంలో ఎన్నో సినిమాలలో నటించింది. ఇక ఇందులో వెన్నెల కిషోర్ కూడా కమెడియన్ గా నటించారు. జిన్నా సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , టీజర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా కూడా మంచు విష్ణు కొనసాగుతూ ఉన్నాడు ఒకవైపు హీరోగా మరొకవైపు పలు బాధ్యతలను చేపడుతూ కెరియర్ పరంగా ముందుకు వెళుతున్నాడు మంచు విష్ణు.