గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని రేపు అనగా సెప్టెంబర్ 30 వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించారు. ఈ మూవీ ని రేపు అనగా సెప్టెంబర్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు   తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు దాదాపు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు  ఈ మూవీ ని తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పొన్నియన్ సెల్వన్ మూవీ టికెట్ ధరలు హైదరాబాద్ లో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

పొన్నియన్ సెల్వన్ మూవీ టికెట్ ధరలు హైదరాబాద్ సిటీలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 295 రూపాయల గాను ,  సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను ఉండనున్నట్లు సమాచారం. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష శోభిత ధూళిపాల ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: