సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన బ్రహ్మోత్సవం , స్పైడర్ మూవీ లతో వరుసగా రెండు అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చాడు. అప్పటి నుండి వరుసగా మహర్షి ,  సరిలేరు నీకెవ్వరు తాజాగా సర్కారు వారి పాట మూవీ లతో వరుస విజయాలను అందుకుంటు ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించ బోతున్నాడు. ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరి పోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ నటుడు లో ఒకరిగా కొనసాగుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక అదిరి పోయే కీలక పాత్రలో కనిపించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే మహేష్ బాబు మూవీ పై ప్రేక్షకుల్లో మరింత హైట్ పెరిగే అవకాశం ఉంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: