టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా ఇప్పటికి కూడా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాగర్జున ఈ సంవత్సరం బంగార్రాజు ,  బ్రహ్మాస్త్ర మూవీ లతో రెండు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ కి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించగా , సోనాల్ చౌహాన్మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ , భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  మొదట ఈ మూవీ కి విక్రమ్ అనే టైటిల్ ని మూవీ యూనిట్ అనుకున్నారట , కాక పోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ కి విక్రమ్ అనే టైటిల్ ని తీసి వేసి ది ఘోస్ట్ అనే టైటిల్ ని మూవీ యూనిట్ కన్ఫామ్ చేసిందట. ఇది ఇలా ఉంటే నాగార్జున హీరోగా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ లోని యాక్షన్స్ అన్ని వేషాలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అని ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: