విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ కొన్ని రోజుల క్రితం థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా తేరకెక్కింది. అలా ఎఫ్ 2 మూవీ కి సీక్వల్ గా తిరకేక్కడంతో ఎఫ్ 3 మూవీ పై విడుదలకు ముందే భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఎఫ్ 3 మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకొని మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అయింది. మొదటి సారి ఈ మూవీ జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అయినప్పుడు 8.26 "టి ఆర్ పి" ని సాధించింది.

ఇలా మొదటి సారి బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు ఎఫ్ 3 మూవీ మంచి "టి ఆర్ పి" రేటింగ్ ని సాధించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించగా , ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. దేవి శ్రీ ప్రసాద్  అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించగా , పూజా హెగ్డేమూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: