టాప్ యంగ్ హీరోలు మాస్ హీరోలుగా మారినప్పుడు మాత్రమే వారి ఇమేజ్ మరింత పెరుగుతుంది. తద్వారా వారి మార్కెట్ తో పాటు వారి క్రేజ్ కూడ పెరిగి వారికి భారీ పారితోషికాలు నిర్మాతలు ఇస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో మాస్ హీరోగా మారాలని నాని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతడికి క్లాస్ హీరో లేదంటే పక్కింటి అబ్బాయిలా ఉంటాడు అన్న ఇమేజ్ ఏర్పడింది కానీ ఎక్కడా తాను కోరుకున్న మాస్ హీరో ఇమేజ్ అతడికి అందుబాటులోకి రావడం లేదు.


దీనితో ఇప్పుడు నాని అల్లు అర్జున్ యష్ ల మార్గాన్ని అనుసరిస్తూ తన లేటెస్ట్ మూవీ దసరా లో నటిస్తున్నాడా అన్నసందేహాలు కలుగుతున్నాయి. ‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ అదేవిధంగా ‘కేజీ ఎఫ్’ మూవీలో యష్ ల రఫ్ లుక్ లకు మించి దసరా మూవీలో నాని రఫ్ లుక్ ఉండబోతోంది. ఇప్పటివరకు ఎవరు చూడని నాని రఫ్ లుక్ ను ఈమూవీ నిర్మాతలు విడుదల చేసారు. సింగరేణి కాలరీస్ బ్యాక్ డ్రాప్ లో తీసిన పాటకు సంబంధించి పూర్తిగా బ్లాక్ టింట్ తోనే చిత్రీకరించారు.


ఈపాటకు మాస్ బీట్ జత అవ్వడంతో పాటు ఆ పాటకు తగ్గట్టుగా నాని ఫుల్ మాస్ అవతారంతో పూనకం వచ్చిన వ్యక్తిలా ఊగిపోయాడు. వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో తీసిన ఈపాట ఈమూవీకి హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది. ఇలాంటి మాస్ అవతారంలో నాని నటించడంతో ఎంతవరకు ఈ లుక్ ను ప్రేక్షకులు అంగీకరిస్తారు అని చూడవలసి ఉంది.


వాస్తవానికి ఈసినిమాను దసరా రేస్ లో దింపాలని భావించారు. అయితే చిరంజీవి నాగార్జునల పోటీ మధ్య చిక్కుకోవడం నానీకి పెద్దగా ఇష్టం లేకపోవడంతో ఈమూవీ విడుదల వాయిదా వేసారు. వరస పరాజయాలతో సతమతమైపోతున్న నానీకి ఈమూవీ విజయం అత్యంత కీలకంగా మారడంతో ఈమూవీ విడుదల కోసం సరైన రిలీజ్ డేట్ ను ఆలోచిస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: