ఈ ఏడాది ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకున్న చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో మంచి సూపర్ హిట్ ని అందుకున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో భోళా శంకర్ ,వాల్తేరు వీరయ్య, తదితర సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్లో చాలా వేగంగా పాల్గొంటున్నారు చిరంజీవి. ఇక ఈ చిత్రాలు సంక్రాంతికి లేదా వేసవికాలంలో విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రం ఇప్పటివరకు రూ.100 కోట్ల రూపాయలను గ్రాస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అనుకున్నంత స్థాయిలో ప్రచారం చేయకపోయినా ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో చిరంజీవి కూడా కాస్త ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించడంతో ప్రతి ఒక్కరిలోను ఈ సినిమా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోని గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంస్టాగ్రామ్ లో చిరంజీవి చాట్ చేయడం జరిగింది. అందులో పూరి జగన్నా మీకు ఇష్టమైన రాజకీయ నాయకుల గురించి చెప్పండి అని అడగగా.. పాత జనరేషన్లో అయితే చాలామంది మహానుభావులు ఉన్నారు వారు అనేక పార్టీలలో ఉన్నారని తెలియజేశారు.


అయితే తనకు ఇష్టమైన రాజకీయ నాయకులు మాత్రం మాజీ ప్రధాన మంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారి వాజ్పేయి అని తెలియజేయడం జరిగింది. వీరిద్దరి హయాంలోని ఎన్నో మంచి పనులు జరిగాయని తెలియజేశారు. దీంతో మెగాస్టార్ అభిమానులు , నేటిజన్లలలో పలు రకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన మంత్రులుగా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ తదితరులు ఉన్నా కూడా చిరంజీవి వాళ్ళను కాదని ఇతరుల పేర్లు చెప్పడం విశేషమని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న తరహాలో ఇష్టమైన రాజకీయ నాయకుల పేర్లు చెప్పకపోవడం కామనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: