కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ .6000 రూపాయలను అందిస్తుంది. ఇప్పటివరకు 20 విడతలు విడుదల చేశారు. తాజాగా 21 వ విడత కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని నియమాలను మార్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో భూమి సాగు చేసుకుంటున్న కొన్ని వేల మంది రైతులకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లుగా ప్రకటించారు.


భూ యాజమాన్య పత్రాలు లేకపోయినా రైతులకు పిఎం కిసాన్ కింద ఇప్పటినుంచి ఈ పథకం ప్రయోజనం చేకూరుతుందంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజు సింగ్ చౌహన్ తెలియజేశారు. సరిహద్దు ప్రాంతాలలో ఎవరైనా రైతులు భూమి పత్రాలు లేని వారు వ్యవసాయం చేస్తూన్న ప్రభుత్వం వారిని దృవీకరిస్తుందని తెలిపారు. దీనివల్ల ఈ పథకం ప్రయోజనాలను కూడా పొందవచ్చని కొత్త నిబంధనను ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే రైతు వాస్తవంగా అక్కడ వ్యవసాయం చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించాల్సిన పరిస్థితి ఉన్నది.


దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ రైతులు 21వ విడత కోసం ఎదురుచూస్తున్నారు.. దీపావళి నాటికి రైతుల ఖాతాలో రూ.2000 రూపాయలు బదిలీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఆగస్టు 2వ తేదీన కిసాన్ 20వ విడతను విడుదల చేశారు. ఆ తర్వాత విడత అక్టోబర్ 20వ తేదీ లోపు రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారా. ఇప్పటివరకు 20 విడతలు దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేశారు. అయితే ఈసారి నియమాలలో కొత్త మారినట్లుగా వినిపిస్తోంది.


అదేమిటంటే వరద ప్రభావిత ప్రాంతాలలో ఉండే రైతులకు ఈసారి ముందుగా 21వ విడతను ముందుగా విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. అలాంటి ప్రాంతాలలో పంజాబ్, హిమాచల్ వంటి ప్రాంతాలలో మొదట పడే అవకాశం ఉంది. అలాగే E-కేవైసీ చేయించుకొని రైతులకు ఈ పథకం కింద డబ్బులు పొందలేరు. అలాగే బ్యాంకు బుక్, ఆధార్, మొబైల్ నెంబర్ ని అనుసంధానం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: