
సూపర్‌స్టార్ తలైవా రజినీకాంత్ ఇప్పుడు ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న జైలర్ చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది.
రజినీ 169వ చిత్రమిది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కుతోంది. తదుపరి రజినీకాంత్ ఏ సినిమాను డైరెక్ట్ చేస్తార నే దానిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల మేరకు తలైవర్ ఓ సెన్సేషనల్ డైరెక్టర్‌తో 21 ఏళ్ల తర్వాత సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా మణి రత్నం. ఇంత కు ముందు రజినీకాంత్, మణి రత్నం కాంబినేషన్ లో దళపతి వంటి క్లాసిక్ మూవీ రూపొంది న విషయం తెలిసిందే. ఆ సినిమా 1991లో విడుదలైంది. అప్పటి నుంచి రజినీకాంత్ - మణిరత్నం కాంబినేషన్ లో సినిమా రానే లేదు.
అయితే రీసెంట్ గా మణిరత్నం ఓ లైన్‌ను రజినీకాంత్‌కి వినిపించార ట. ఆయనకు చాలా బాగా నచ్చేసింది. వెంటనే పూర్తి కథను సిద్ధం చేసి వినిపించమన్నార నే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్. ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 తెరకెక్కాల్సి ఉంది.
ఆ సినిమా పూర్తయిన తర్వాత రజినీకాంత్ తో మణిరత్నం సినిమాను చేస్తారంటున్నారట.. ఈ గ్యాప్‌లో ఏస్ డైరెక్టర్ కథను సిద్ధం చేసుకుంటారు. మరో వైపు రజినీకాంత్ తన జైలర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటారు. రజినీకాంత్, మణిరత్నం కాంబినేషన్ మూవీని నిర్మించటానికి లైకా ప్రొడక్షన్స్ సంస్థ సిద్ధంగా నే ఉంది. మరికొన్ని నెలల్లోనే ఈ క్రేజీ కలయికలో రానున్న సినిమాపై మరింత క్లారిటీ వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం అందింది.. నిజంగానే ఈ సినిమాకు సంబంధించి న ప్రకటన వస్తే మాత్రం.. సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయనటం లో సందేహం అయితే లేదు.