చిరంజీవి కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్.సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా హిందీలో కూడా సక్సెస్ కావడానికి కారణమైంది. అయితే ఈ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేశారు. అదంతా కేవలం చిరంజీవి పైన అభిమానం కారణంగానే చేశారని తెలిపారు సల్మాన్ ఖాన్. ఆ కారణంగానే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ భాగస్వామిగా మారారని చెప్పవచ్చు. ఇక తన రుణాన్ని మాత్రం ఏదో ఒక రూపంలో తను గాని తన కొడుకు గాని తీర్చుకుంటామని చిరంజీవి ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.


అయితే ఇప్పుడు తాజాగా అలాంటి రుణం తీర్చుకునే అవకాశం చిరంజీవికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ వద్దన్నా కూడా చిరంజీవి తగ్గి మరి నటిస్తున్నారని సమాచారం. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ -3 సినిమాలు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం హిందీ తో పాటు తెలుగు తమిళ్ వంటి భాషలలో భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు సాధారణంగా సల్మాన్ ఖాన్ ప్రతి సినిమా కూడా అన్ని భాషలలో విడుదలగుతూ ఉంటుంది.


ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టిపెట్టిన సల్మాన్ ఖాన్ టైగర్ -3 సినిమాని భారీ ప్లానింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ ప్రమోషన్స్ కోసం చిరంజీవి నేరుగా రంగంలో దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీపావళి సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని హైదరాబాద్ తో సహా చెన్నై ఇతర ప్రాంతాలలో కూడా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి తప్పక హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా తెలుగు వర్షన్ కు ప్రెస్ మీట్ పెట్టి మరి చిరంజీవి తెలియజేయబోతున్నట్లు వార్తలు వినిపి స్తున్నాయి. అయితే సల్మాన్ ఖాన్ అడగకుండానే చిరంజీవి ఈ విషయంపై తన బాధ్యతగా ఫీల్ అయ్యి సహకరిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: