శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తన తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నాడు అన్న ఆ సక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. పలువురు అగ్ర దర్శకుల పేర్లు వినిపిస్తున్నా కూడా ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ చేయబోయే తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది అన్న క్లారిటీ లేకపోవడం ఆయన అభిమానులలో  ఎంతగానో నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది. 

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన లైగర్ సినిమా ఏ మాత్రం అలరించక పోవడం తో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ చాలా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పాలి. ఒకవైపు భారీ నమ్మకాన్ని పెట్టుకున్న సినిమా ఆడక పోవడం ఆయనను నిరాశ పరుస్తూ ఉంటే ఇంకొక వైపు ఆయనపై ఎంతో మంది విమర్శకులు దాడి చేయడం మరింత కృంగదీసింది. ఇప్పుడు ఎలాగైనా ఒకసారి విజయాన్ని అందుకోవాల్సిన నేపథ్యంలో ఖుషి చిత్రం నుండి తప్పకుండా మంచి విజయం అందుకునే విధంగా ఆయన ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పట్టించుకుని విజయ్ దేవరకొండ ఈ సినిమాను ఫిబ్రవరిలో విడు దల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుగుతుంది అని చెప్పాలి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా దా దాపుగా ఖరారు అయ్యిందన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాలామంది  పెద్ద దర్శకులు విజయ్ దేవరకొండ తో సినిమా చేసే విధంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. మరి ఇన్ని సినిమాలు లైన్ లో ఉన్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడో అనేది చూడాలి.  ఇటీవలే ఈ హీరో కి గౌతం తిన్ననురి ఓ సినిమా చేయాల్సింది గా కథను చెప్పడం జరిగిందట. త్వరలోనే ఈ సినిమా పట్టాలక్కే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: