
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. 2019లో వచ్చిన ‘భారత్’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు హిట్టు లేదు. అయితే ఫలితం ఎలా ఉన్నా సల్మాన్‌ఖాన్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘గాడ్‌ఫాదర్’లో కాసేపు మెరిసాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘టైగర్-3’ ఒకటి. టైగర్ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై భారీ అంచ నాలు నెలకొ ల్పాయి.చిత్ర బృందం తాజా గా ఈ సినిమా తెలుగు, తమిళ పోస్టర్‌లను రిలీజ్ చేసింది. దీం తో ఈ ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్నట్లు క్లారిటీ వచ్చింది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా లో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తుంది. గతంలో ఈ సిరీస్‌లో తెర కెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించా యి. ప్రస్తు తం ఈ సినిమా షూటింగ్ శరవే గంగా జరుగు తుంది. ఇక సల్మాన్ దీని తో పాటు మరో రెండు సినిమా ల్లో నటిస్తున్నాడు. అందులో షారుఖ్ పటా న్‌లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు.