టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ శౌర్య తాజాగా కృష్ణ వ్రిందా విహారి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించగా ,  ఈ మూవీ కి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించాడు. మహతి స్వర సాగర్మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ ను తెచ్చుకొని ,  పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
 
నైజాం :1.75 కోట్లు .
సీడెడ్ : 38 లక్షలు .
యు ఏ : 43 లక్షలు .
ఈస్ట్ : 31 లక్షలు .
వెస్ట్ : 19 లక్షలు .
గుంటూర్ : 31 లక్షలు .
కృష్ణ : 30 లక్షలు .
నెల్లూర్ : 13 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కృష్ణ వ్రిందా విహారి మూవీ టోటల్ గా 3.80 కోట్ల షేర్ , 6.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 20 లక్షలు .
ఓవర్ సీస్ లో : 72 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా టోటల్ గా కృష్ణ వ్రిందా విహారి మూవీ 4.72 కోట్ల షేర్ , 8.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: