
రేపు మూవీ విడుదలవుతున్న సందర్భంగా మాట్లాడుతూ
'ఆర్‌ఎక్స్ మూవీ నాకు మంచి పేరు తెచ్చింది. అయితే ఆ సినిమా తరువాత నా మేనేజర్‌తో పాటు కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో స్క్రిప్ట్ కూడా వినకుండానే సినిమాలు చేసేశాను. కథ విని, ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటేనే పేరు వస్తుందని తెలుసుకుని ఇప్పుడు బాగా జాగ్రత్తపడుతున్నాను ఆమె అన్నారు. 'అనగనగా ఓ అతిథి' మూవీ చూసి మోహన్‌బాబు సర్ నాకు ఫోన్ చేసి నన్ను మెచ్చుకున్నారు. తర్వాత రెండు నెలలకి 'జిన్నా'లో నాకు చాన్స్ ఇచ్చారు. స్వాతి అనే విలేజ్ గాళ్ పాత్ర. పచ్చళ్లు అమ్ముతుంటాను.
నా రోల్‌తో పాటు మూవీ కూడా బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. విష్ణు, సన్నీ లియోన్‌లతో కలిసి నటించడం చాలా హ్యాపీ గా ఉంది. ఈ సినిమాతో జర్నీ ఓ ట్రైనింగ్‌లా ఉపయోగపడింది. చాలా నేర్చుకున్నాను. టికెట్స్‌కి పెట్టే ఖర్చుతో సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చూడొచ్చని ఓటీటీలకి వెళ్తున్నారు ఆడియెన్స్. అద్భుతమైన కంటెంట్ ఉంటేనే థియేటర్‌కొచ్చి మరీ చూస్తున్నారు. ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమానే. దీని తర్వాత నావి మూడు సినిమాలు రానున్నాయి. కన్నడ మూవీ 'హెడ్‌బుష్' ఒక డాన్ బయోపిక్. అలాగే 'మీటూ మాయాపేటిక' మూవీలో ఐదు స్టోరీస్ ఉంటాయి. నాది చాలా ఇంటరెస్టింగ్ రోల్. ఇక 'గోల్‌మాల్' అనే తమిళ సినిమాలో జీవాతో యాక్ట్ చేస్తున్నాను. హిందీ మూవీ 'దే ధనాధన్'కి ఇది రీమేక్. ఇంకొక సినిమా డిస్కషన్ దశలో ఉంది' అని చెప్పింది పాయల్ రాజ్ పుత్.