
తెలుగు రాష్ట్రాలలో విష్ణు సినిమాకు పెద్దగా థియేటర్లు దొరకపోయినా హైదరాబాదులో థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంగ్లీష్ సినిమా బ్లాక్ ఆడమ్ కు ఎక్కువగా థియేటర్లు దొరకడం వల్ల మరోవైపు యూఎస్ ప్రీమియర్లు కూడా సరిగ్గా పడలేదని సమాచారం. అయినప్పటికీ కూడా జిన్నా సినిమా చూశామని కొంతమంది బాగుందని తమ ట్విట్టర్లో తెలియజేయడం జరిగింది.
ఢీ లాంటి మరొక కామెడీ టైమింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విష్ణు కం బ్యాక్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. కానీ సన్నీలియోన్ కోసమే థియేటర్లకు వెళ్లేవారు కచ్చితంగా బాధపడతారని తెలియజేస్తున్నారు. ఈ చిత్రం ఒక హర్రర్ కామెడీ జోనర్ చిత్రమని మంచు విష్ణు ఈ సినిమా కథ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని తెలియజేస్తున్నారు. మరొక ట్విట్టర్ యూజర్ మాత్రం కథ పరంగా బాగానే ఉన్న కాస్త సినిమా నెమ్మదిగా సాగుతుందని సన్నీలియోన్ ,మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందని తెలియజేశారు. పాయల్ అందాలు ఈ సినిమాకి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. చివరిలో క్లైమాక్స్ మామూలుగా లేదని 3.23/5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది అన్న సూపర్ గా ఉంది మూవీ అని తెలియజేయడం జరుగుతుంది. మరి కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.