నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే తన సొంత బ్యానర్ పైన పలు చిత్రాలను నిర్మిస్తూ ఉన్నారు నాని. నాని నిర్మించిన చిత్రాలలో హిట్-1 సినిమా కూడా ఒకటి అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హీరో విశ్వక్ సేన్ 2020 బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించారు. ఈ సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ ఇప్పుడు తాజాగా ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

హిట్ -2 చిత్రంలో విలక్షణమైన నటుడుగా పేరుపొందిన అడవి శేషు నటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా చాలా శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా అడవి శేషు ఈ సినిమాని చాలా రఫ్ గా చూశానని,  తన సరికొత్త అవతారంలో ఈ చిత్రంలో చాలా సూపర్ గా కనిపించబోతున్నానని తెలియజేశారు. ఇక ఈరోజు ఈ సినిమా గురించి మరొక అప్డేట్ ఇచ్చారు నిర్మాత అయిన నాని. అడవి శేషు చేసిన పోస్టుకు ట్వీట్ చేస్తూ అతి త్వరలోనే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని తెలియజేశారు.


హిట్ -1 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అంతకుమించి  ఉంటుంది అని తెలియజేశారు డైరెక్టర్ శైలెస్.. ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఈసారి కూడా ఆడియన్స్ ను తప్పకుండా అలరిస్తుందని తెలియజేశారు నాని. ఇక నాని ప్రస్తుతం సినిమా ల విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల  దర్శకత్వంలో దసరా అనే చిత్రంలో నటిస్తున్నారు .ఈ చిత్రాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో డి గ్లామరస్ పాత్రలో నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: