
హిట్ -2 చిత్రంలో విలక్షణమైన నటుడుగా పేరుపొందిన అడవి శేషు నటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా చాలా శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా అడవి శేషు ఈ సినిమాని చాలా రఫ్ గా చూశానని, తన సరికొత్త అవతారంలో ఈ చిత్రంలో చాలా సూపర్ గా కనిపించబోతున్నానని తెలియజేశారు. ఇక ఈరోజు ఈ సినిమా గురించి మరొక అప్డేట్ ఇచ్చారు నిర్మాత అయిన నాని. అడవి శేషు చేసిన పోస్టుకు ట్వీట్ చేస్తూ అతి త్వరలోనే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని తెలియజేశారు.
హిట్ -1 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అంతకుమించి ఉంటుంది అని తెలియజేశారు డైరెక్టర్ శైలెస్.. ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఈసారి కూడా ఆడియన్స్ ను తప్పకుండా అలరిస్తుందని తెలియజేశారు నాని. ఇక నాని ప్రస్తుతం సినిమా ల విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే చిత్రంలో నటిస్తున్నారు .ఈ చిత్రాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో డి గ్లామరస్ పాత్రలో నటించబోతున్నారు.