తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయిన కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ హీరో తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యుగానికి ఒక్కడు ,  ఆవారా , నా పేరు శివ , ఖాకీ ,  ఖైదీ వంటి విజయవంతమైన మూవీ లతో కార్తీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కార్తీ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా ,  పి ఎస్ మిత్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 21 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా విడుదల అయింది  ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో సర్దార్ మూవీ కి తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని , అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తున్న సర్దార్ మూవీ "ఓ టి టి" హక్కులకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. సర్దార్ మూవీ "ఓ టి టి" హక్కులను ఆహా "ఓ టి టి"  ఫ్లాట్ ఫామ్ దక్కించుకున్నట్లు కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: