ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా, డ్యాన్స్‌ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి.. మాధురీ దీక్షిత్‌. అయిదు పదులలో కూడా ఆమె అందం వయసు నిండా పదహారే!ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా, డ్యాన్స్‌ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి.. మాధురీ దీక్షిత్‌. అయిదు పదులలో కూడా ఆమె అందం వయసు నిండా పదహారే! నటిగా వెండితెరపై కాస్త గ్యాప్‌ తీసుకున్నా.. యాడ్స్‌లో నటిస్తూ, పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ అభిమానులను పలకరిస్తూనే ఉంది. 'మజా మా'
సినిమాతో ఓటీటీ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించిన అందాల తార మాధురి ముచ్చట్లు..

భారతీయ సంస్కృతి చాలా గొప్పది. పండుగలు, ఉత్సవాల సమాహారం. ప్రతి వేడుకకూ కుటుంబసభ్యులంతా ఒకచోట చేరడం నిజంగా గొప్ప విషయం. కలిసి భోంచేయడం వల్ల బంధాలు, బంధుత్వాలు బలపడతాయి. అందుకే నాకు అన్ని పండుగలూ ఇష్టమే. దీపావళి మరింత ఇష్టం. ఆరోజు నేనే స్వయంగా మిఠాయిలు చేసి దేవుడికి నైవేద్యం పెడతాను.

హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చేది. చాలా బాధగా అనిపించేది. కానీ వృత్తికి న్యాయం చేయాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. ఈ మధ్యే ఓటీటీలో విడుదలైన 'మజా మా'లో ఇద్దరు పిల్లల తల్లి పాత్ర నాది. ఒక స్త్రీ ఇంట్లో ఇల్లాలిగా, తల్లిగా ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు.కుటుంబం విషయానికి వస్తే.. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు. చిన్నబ్బాయి స్కూల్‌ పూర్తయింది. ఆ వయసు పిల్లలతో తల్లి అనుబంధం ప్రత్యేకమైంది. వీలైనంత వరకు సినిమాలో నా పాత్రను ఇంటివరకూ తీసుకెళ్లను. కానీ కొన్నిసార్లు అదే మూడ్‌లో ఉండిపోతాను. ఏదైనా సెంటిమెంట్‌ సీన్‌లో నటించిన రోజు నాకు తెలియకుండానే ఆ ఉద్వేగాల్ని మోసుకెళ్తాను. ముభావంగా ఇంటికి చేరితే పిల్లలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ప్రతి పాత్రలో లీనమైతేనే న్యాయం చేయగలమని నమ్ముతాను.ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణులు కాదు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. కాబట్టి, లోపాన్ని పక్కనపెట్టి మంచిని ప్రేమించాలి. ప్రతి పనిలోనూ ఓ సమస్య తప్పనిసరి. దాన్ని అధిగమించి.. మనం చేస్తున్న పనిని ఇష్టపడి చేయాలి. సంపూర్ణంగా చేయడానికి ప్రయత్నించాలి. జయాపజయాలు దైవాధీనాలు. ప్రశంసలకు పొంగిపోకూడదు,
విమర్శలకు కుంగిపోకూడదు. ఎవరేమనుకున్నా సరే, నచ్చిందే చేయమని చెప్పింది అమ్మ. ఆ మార్గంలోనే నడుస్తున్నా.సెలెబ్రిటీ హోదా వల్ల వచ్చే తొలి సమస్య.. ప్రైవసీ. ఎక్కడికెళ్లినా కెమెరాలు వెంటాడుతాయి. మనం ధరించే దుస్తులను బట్టి మనమేమిటో తీర్పు చెప్పేస్తుంది సమాజం. అందుకే, నలుగురిలోకి వెళ్తున్నప్పుడు దుస్తుల మీద చాలా దృష్టి పెడతా. సమాజంలో పాజిటివ్‌ టాక్‌ పెంచుకోవడం ఒక నటిగా నాకు చాలా అవసరం.

సోషల్‌ మీడియా.. అభిమానులకు, సెలెబ్రిటీలకు మధ్య వారధిగా పనిచేస్తున్నది. మా రోజుల్లో ఇంత సాంకేతికత లేదు. థియేటర్‌లో సినిమా వస్తే కానీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు
ప్రతి సమాచారాన్నీ తక్షణం పంచుకునే వీలుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: