
మీ టూ' ఉద్యమంతో ఒక్కొక్క హీరోయిన్ తమకు ఎదురైన అనుభవాలను నిర్భయంగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నాటి కాలం భామలే కాదు, పాత కాలం నటీమణులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారట.. కొన్ని సందర్భాలలో వారు తాము ఎదుర్కొన్న ఇబ్బందులని గురించి తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తు న్నారు. అయితే సీనియర్ భామలని గతంలో చాలా ఇబ్బంది పెట్టేవారట.
దర్శకులు కొందరు ఇలాంటి, అలాంటి డ్రెస్సులు వేసుకోవాలని వారిని చాలా ఇబ్బంది పెట్టేవారట. కొందరు దర్శకులతో పని చేయడానికి వారు చాలా ఇబ్బంది పడేవారట. ఇటీవల పలు ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్‌లోతమ ఇబ్బందులు చెప్పుకొని బాధపడ్డారట. ఇటీవల సీనియర్ నటీమణలు కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడీ అందాలు ను ఆరబోస్తున్నారు. ప్రగతి ఆంటీ ఇటీవల ఎంతగా రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిమ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలతో నానా రచ్చ చేసింది. ఈ అమ్మడు ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్‌గాను నటించింది.
ప్రగతి చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా కనిపించింది. మీరు హీరోయిన్గా ఎందుకు ఎక్కువ సినిమాలలో నటించలేదు అంటే. నేను రజనీకాంత్- కమలహాసన్ అయితేనే హీరోయిన్గాగా చేస్తాను.. వేరే వారితో నేను చేయను అని డైరెక్టర్ తో చెప్పానని ఆమె చెప్పిందట'. హీరోలకు తల్లిగా నటిస్తూ మీరు ఇప్పుడు వచ్చే కుర్ర హీరోయిన్లకు మీరు గ్లామర్ షోలో పోటీ పడుతున్నారు అన్న ప్రశ్నకు. 'ఎలా ఉన్నా నేను అందగత్తెనే. ఆందం వల్లే నాకు సినిమాలు వస్తున్నాయి అదే నాకు పెద్ద ఆస్తి'.. ప్రగతి చెప్పుకొచ్చిందట. ఇక మరో సీనియర్ హీరోయిన్ సురేఖా వాణి కూడా కొంత రెచ్చిపోయి అందాల రచ్చ రచ్చ చేస్తుంది.