టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన నిఖిల్ "హ్యాపీ డేస్" మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. హ్యా పీడేస్ మూవీ తర్వాత ఈ హీరో పలు మూవీ లలో హీరో గా నటించి నప్పటికీ నిఖిల్ కు ఆ మూవీ లు పెద్దగా క్రేజ్ ను తీసుకు రాలేక పోయాయి. ఇది ఇలా ఉంటే అలాంటి సందర్భం లోనే నిఖిల్ "స్వామి రారా" మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందు కొని ఫుల్ ఫామ్ లోకి తిరిగి వచ్చాడు. ఇది ఇలా ఉంటే నిఖిల్ కెరియర్ లో మంచి బ్లాక్ బాస్టర్ మూవీ లలో కార్తికేయ సినిమా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన కార్తికేయ మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా కార్తికేయ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడంతో తాజాగా కార్తికేయ 2 మూవీ ని కూడా తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే.  

కార్తికేయ మూవీ మంచి విజయం సాధించడంతో కార్తికేయ 2 మూవీ పై  ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన కార్తికేయ 2 మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. ఇలా కార్తికేయ 2 మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో కార్తికేయ 3 మూవీ ని కూడా తెరకెక్కించే ఆలోచనలో మూవీ  మేకర్స్ ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇది ఇలా ఉంటే కార్తికేయ 3 మూవీ రెగ్యులర్ షూటింగ్ 2024 సంవత్సర చివరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: